Fake Passport: ఫేక్ డాక్యుమెంట్స్‌తో పాస్‌పోర్టు పొందిన వారిపై సీఐడీ చర్యలు

CID Action against those who obtained Passport with Fake Documents
x

ఫేక్ డాక్యుమెంట్స్‌తో పాస్‌పోర్టు పొందిన వారిపై సీఐడీ చర్యలు 

Highlights

Fake Passport: 92 మందికి లుక్ అవుత్ నోటీసులు జారీ చేసిన సీఐడీ

Fake Passport: నకిలీ ధ్రువీకరణ పత్రాలతో విదేశీయులకు భారత పౌరులుగా పాస్‌పోర్టులు ఇప్పించి గల్ఫ్‌ దేశాలకు పంపించిన ముఠా గుట్టు రట్టయింది. తెలంగాణ సీఐడీ విభాగం ప్రాథమిక దర్యాప్తులో హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, జగిత్యాల, కోరుట్లలో జరిగిన దందా బహిర్గతమైంది. నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులను సృష్టించడం ద్వారా 92 మందిని భారతీయులుగా దేశం దాటించినట్లు వెల్లడైంది. ఈ 92 మంది దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.

విదేశాలకు చెందిన కొందరు నకీలీ పాస్ పోర్టులు పొంది ఇప్పటికే వేరే దేశాలకు వెళ్లగా మిగిలిపోయిన వారైనా దేశం దాటకుండా ఉండేందుకు సీఐడీ చర్యలు ముమ్మరం చేసింది ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లోని అధికారులను అప్రమత్తం చేసి మిగిలిన వారు దేశం దాటకుండా నిఘా పెట్టింది. విజిటింగ్ వీసాలతో థాయిలాండ్‌, కెనడా, మలేషియా, ఇరాక్, దుబాయ్, స్పెయిన్, ఫ్రాన్స్ వెళ్లినట్లు వెల్లడించింది. ఆయా దేశాల్లో భారతీయ పౌరులుగా విదేశీయులు చలామణి అవుతున్నారని పేర్కొంది. జగిత్యాల, ఫలక్‌నుమాలోని చిరునామాలతో ఎక్కువగా పాస్​పోర్టులను తీసుకున్నారని దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories