Bijinapally: మంగనూరు చెక్ పోస్ట్ వద్ద సిఐ గాంధీ నాయక్ తనిఖీలు

Swathi Adulapuram
Published on: 26 April 2020 4:00 PM IST
Bijinapally: మంగనూరు చెక్ పోస్ట్ వద్ద సిఐ గాంధీ నాయక్ తనిఖీలు
X

బిజినపల్లి మండలంలోని మంగనూరు గ్రామ శివారులో చౌడేశ్వరి దేవాలయం ముందు ఏర్పాటు చేసిన పోలీసు చెక్ పోస్ట్ వద్ద, ఆదివారం నాడు నాగర్ కర్నూల్ సిఐ గాంధీ నాయక్ అకస్మికంగా తనిఖీ చేసారు. ఆయనతో పాటు బిజినపల్లి ఎస్సై కె.వెంకటేష్ వాహనాలను తనిఖీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... కరోనా వ్యాధి వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా, నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దు ప్రదేశాలలో పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

బిజినపల్లి మండలంలోని మంగనూరు, అల్లిపూర్ గ్రామ శివార్లలో పోలీసు తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు నుండి వచ్చే వారి వాహనాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అనుమతి లేని వాటిని గుర్తించి వెంటనే పోలీస్ స్టేషన్ కు తరలించాలని సిబ్బందికి సూచించారు. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవని అన్నారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story