Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు..

Chittoor Road Accident: చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం అర్థరాత్రి రోడ్డుప్రమాదానికి గురైంది.

Arun Chilukuri
Published on: 8 Jan 2026 11:42 AM IST
Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు..
X

Chittoor Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 9 మందికి గాయాలు..

Chittoor Road Accident: చిత్తూరు జిల్లా పొన్నమాకులపల్లిలో కిండర్ కేర్ దివ్యాంగుల ట్రస్ట్ పాఠశాల వాహనం అర్థరాత్రి రోడ్డుప్రమాదానికి గురైంది. బెంగళూరు- చెన్నై నేషనల్ హైవేపై వేగంగా స్కూల్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో స్కూల్ వాహనంలో 11 మంది విద్యార్థులు ఉండగా.. 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో వైద్య పరీక్షలు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story