Chimpanzee Birthday Celebrations: నెహ్రూ జువాలజికల్ పార్కులో వింత సంఘటన..

Chimpanzee Birthday Celebrations:  నెహ్రూ జువాలజికల్ పార్కులో వింత సంఘటన..
x
Chimpanzee Birthday Celebrations Setups In Hyderabad Nehru Zoo Park
Highlights

Chimpanzee Birthday Celebrations: సాధారణంగా పుట్టిన రోజు పండగలను ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు, పెద్దలకు చేయడం పరిపాటి.

Chimpanzee Birthday Celebrations: సాధారణంగా పుట్టిన రోజు పండగలను ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు, పెద్దలకు చేయడం పరిపాటి. కానీ కొంత మంది మాత్రం తాము పెంచుకుంటున్న పెంపుడు జంతువులకు కూడా పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటారు. జంతువుకు పుట్టినరోజు ఏంటని ఆశ్చర్యపోతున్నారా. కానీ అది నిజం. ఆ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ని కూడా పిల్లలకి చేసిన విధంగా గ్రాండ్ గా చేస్తారు. ఇదే తరహాలో హైదరాబాద్ ‌లోని నెహ్రూ జువాలజికల్ పార్కులో కూడా చిన్నపాటి వేడుకను నిర్వహించారు జూ సిబ్బంది. జూలో ఉన్న ఓ జంతువులు పుట్టిన రోజు వేడుకలను జరిపించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉండే "సుజీ" అనే చింపాంజీకి బుధవారం నాటికి దీనికి 34 ఏళ్లు వచ్చాయి. దీంతో జూ అధికారులు, అలాగే సిబ్బంది కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ సుజీకి చిన్నపాటిగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగానే సుజీ కోసం జూ వంటగదిలో పండ్లు, రొట్టెలతో కూడిన ఫ్రూట్ కేక్ తయారు చేసి అందించారు. అంతే కాక దాని బోన్ను అందంగా అలంకరించారు. ఆ తరువాత ఆ బోనులో కేకును పెట్టి పుట్టినరోజు వేడుకలు చేశారు. ఇక సిబ్బంధి పెట్టిన కేకును చూసిన సుజీ అది ఏంటి, నా బోనులో ఎందుకుందని దాన్ని పరీక్షగా చూసి, ఆ తర్వాత కొంత సేపటికి కడుపునిండా ఆరగించింది. అది ఎప్పుడైతే కేకును భుజించడం మొదలు పెట్టిందో అప్పుడు జూ అధికారులు, సిబ్బంది బోను బయట నుంచి చూస్తూ సుజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు తినాలని దానికి అర్థమయ్యేలా చెప్పారు. అయితే ఈ సుజీని 2011లో సహారా గ్రూప్ హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కుకు బహుమతిగా ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories