తెలంగాణలో చలి పంజా.. ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: చలి గాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు

Jyothi
Published on: 20 Dec 2023 10:41 AM IST
Chilling Cold In Telangana
X

తెలంగాణలో చలి పంజా.. ఏజెన్సీ ప్రాంతాల్లో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Telangana: రోజురోజుకూ చలి పంజా విసురుతుంది. అటు ఏజెన్సీ .. ఇటు మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దానికి తోడు చలి గాలులతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. తమని తాము కాపాడుకునేందుకు చలి మంటలు వేసుకుని కాస్త రిలీఫ్ అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు చలి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చలి గాలుల ప్రభావం.. వ్యవసాయ పనులకు కూడా ఆటంకంగా మారింది.

Jyothi

Jyothi

Next Story