హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయాలు: ముఠా అరెస్ట్‌

Arun Chilukuri
Published on: 24 Dec 2025 6:33 PM IST
హైదరాబాద్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్లి విక్రయాలు: ముఠా అరెస్ట్‌
X

హైదరాబాద్‌లో సృష్టి తరహా మరో కేసు వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 12 మంది వ్యక్తులను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుంచి ఇద్దరు పసికందులను ఎస్‌వోటీ పోలీసులు రక్షించారు.

ఈ ముఠా దాదాపు 8 ఆస్పత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని గుర్తించారు. అలాగే ఈ గ్యాంగ్ ఇప్పటివరకు 15 మంది పిల్లలను అమ్మినట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని పిల్లలతో పాటు అహ్మదాబాద్ నుంచి పిల్లలను తెచ్చి అమ్మకాలు జరిపినట్లు పేర్కొ్న్నారు. ఒక్కొక్క శిశు అమ్మకం వెనకాల 15 లక్షల లావాదేవీలు జరిగినట్లు వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story