Jogulamba Gadwal: మొబైల్ ఛార్జింగ్ తీస్తూ షాక్‌కు గురైన చిన్నారి మృతి

Jogulamba Gadwal: ఐజ మండలం ఈడిగోనిపల్లిలో ఘటన

Jyothi
Updated on: 29 Nov 2022 1:47 PM IST
Child Dies Due to Electric Shock
X

Jogulamba Gadwal: మొబైల్ ఛార్జింగ్ తీస్తూ షాక్‌కు గురైన చిన్నారి మృతి

Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఈడిగోనిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ ఫోన్ చార్జింగ్ తీస్తూ విద్యుత్ షాక్ తో నిహారిక అనే చిన్నారి ప్రమాదానికి గురైంది. ఇంట్లో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ తీస్తూ విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే గ్రామంలోని ట్రాన్స్ ఫార్మార్ కు ఎర్తులు సరిగా పనిచేయకపోవడంతో ఈ సంఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 20 రోజుల నుంచి కొన్ని ఇండ్లకు విద్యుత్ సరఫరా జరిగి ఫ్యాన్లు, టీవీలు కాలిపోవడం జరిగిందని, ఈ విషయాన్ని విధ్యుత్ అదికారులకు తెలిపినా పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు.

Jyothi

Jyothi

Next Story