చికోటి ప్రవీణ్ పిటిషన్‎పై హైకోర్టు విచారణ

Chikoti Praveen Petition to Provide Police Security
x

చికోటి ప్రవీణ్ పిటిషన్‎పై హైకోర్టు విచారణ

Highlights

Chikoti Praveen: పోలీసు భద్రత కల్పించాలని చికోటి పిటిషన్

Chikoti Praveen: క్యాసినో వ్యవహారంలో ప్రధాన నిందితుడు చికోటి ప్రవీణ్ భద్రత కోసం చేసిన వినతిని.. పరిగణించాలని హైదరాబాద్ సీపీని హైకోర్టు ఆదేశించింది. చికోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలోగా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తనతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పుందని చికోటి ప్రవీణ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈడీ దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీసు భద్రత కల్పించాలని విన్నవించాడు. ఈనెల 4న వినతిపత్రం ఇచ్చినా పోలీసులు స్పందించడం లేదని పిటిషన్‎లో ప్రస్తావించారు. చికోటి ప్రవీణ్ పిటిషన్‎ పరిశీలించిన హైకోర్టు పోలీసు భద్రత కల్పించే అంశాన్ని వారంలోగా పరిశీలించాలని ఆదేశిస్తూ విచారణ ముగించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories