Chikoti Praveen: నాంపల్లి కోర్టులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ పిటిషన్..

Chikoti Praveen: ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేశారన్న చికోటి

Shekhar G
Published on: 19 July 2023 6:49 PM IST
Chikoti Praveen Anticipatory Bail Petition In Nampally Court
X

Chikoti Praveen: నాంపల్లి కోర్టులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ పిటిషన్..

Chikoti Praveen: నాంపల్లి కోర్టులో చికోటి ప్రవీణ్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది అరెస్టైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని పిటిషన్ లో పేర్కొన్నారు చికోటి. ఉద్దేశ పూర్వకంగానే తప్పుడు కేసులు నమోదు చేశారన్న ఆయన.. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. బోనాల ఉత్సవాల సందర్భంగా క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ ఆయుధాలు కలిగిన ప్రైవేటు సెక్యూరిటీతో లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం వద్ద హల్ చల్ చేసిన కేసులో ముగ్గురు నిందితులను ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ప్రభుత్వం నుంచి చికోటి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకున్నందుకు అతనిపైనా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ-1గా ఉన్న చికోటి ప్రవీణ్..నాంపల్లి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు..

Shekhar G

Shekhar G

Next Story