Yadagirigutta: నేడు యాదాద్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..స్వర్ణ గోపురం ప్రారంభం

Highlights

Yadagirigutta: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్లనున్నారు. స్వర్ణ విమాన గోపురంను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. పూర్తిగా...

Yadagirigutta: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనకు వెళ్లనున్నారు. స్వర్ణ విమాన గోపురంను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. పూర్తిగా ఆధ్యాత్మిక అంశం కావడం వల్ల పండితులు పెట్టిన ముహూర్తాల ఆధారంగా ముఖ్యమంత్రి షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ లో యాదగిరి గుట్టకు వస్తారు. 11.54కి మూలా నక్షత్రం, వ్రుషభ లగ్నం, పుష్కర అంశంలో లక్ష్మీ నరసింహస్వామి వారికి గోపురాన్ని అంకితం చేస్తారు. అప్పటి నుంచి ఆలయాన్ని చూస్తే తిరుమలలో ఆనంద నిలయ స్వర్ణ గోపురాన్ని చూసిన ఫీల్ కలుగుతుంది. ఈ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో సీఎంతోపాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పండితులు పాల్గొంటారు. ఈ సందర్భంగా కొండపై 25వేల మంది భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేశారు.

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. దీనికి పూర్తిగా బంగారంతో తాపడం చేయించారు. ఇందుకు 68కిలోల బంగారాన్ని వాడారు. ఇందుకు రూ. 3.90కోట్లు ఖర్చు అయ్యింది. అలాగే గోల్డ్ ప్లేట్ తయారీ, ఏర్పాటు కోసం మరో రూ. 8కోట్లు అయిపోయాయి. చెన్నైకి చెందిన మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ఈ పని చేసింది. నేడు సాయంత్రం నుంచి స్వర్ణగోపురం దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తుంది.

యాదగిరిగుట్ట ఆలయాన్ని నిర్మించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ బంగారు విమాన గోపురాన్ని అప్పటికి ఏర్పాటు చేయలేదు. 2021 నాటికి గోపురానికి తాపడం చేయడానికి 125కేజీల బంగారం అవసరం అని అప్పటి ప్రభుత్వం అనుకుంది. కానీ ఈ అంచనాలు దాదాపు డబుల్ అయ్యాయి. ఇప్పుడు 68 కేజీలతోనే తాపడం పూర్తయ్యింది. ఈ బంగారు గోపురం అయ్యే వరకు భక్తుల్లో కొంత అసంత్రుప్తి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు స్వర్ణ గోపురం కారణంగా యాదగిరి గుట్టను చూస్తే..తిరుమల శ్రీవారి ఆలయాన్ని చూసినట్లే ఉందని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories