యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్‌

Telangana: రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీర్

Sandeep Eggoju
Updated on: 4 March 2021 2:57 PM IST
Chief Minister KCR Visits the Laxmi Narasimhaswami Temple Yadadri
X

యాదాద్రి దేవస్థానం లో సీఎం కెసిఆర్ 

Telangana: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి వారిని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. బాలాలయం వద్ద దర్శనానికి వద్ద సీఎం కేసీఆర్ దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సీఎం రాక సందర్భంగా డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం సీఎం కేసీఆర్‌ ఆలయ పునః నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. దేశానికే తలమానికంగా చేపడుతున్న ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. త్వరలోనే స్తంభోద్భవుని దర్శనభాగ్యం భక్తులకు కలగనున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story