Telangana: రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌

Telangana: యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించనున్న కేసీఆర్‌

Sandeep Eggoju
Published on: 3 March 2021 7:36 PM IST
Chief Minister KCR tour In Yadadri
X
ఫైల్ ఇమేజ్ 

Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్‌ రేపు యాదాద్రి పుణ్య క్షేత్రాన్ని సందర్శించనున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ప్రధానాలయంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న క్యూలైన్‌, పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్‌ సూట్‌ పనులను పరిశీలించనున్నట్టు సమాచారం. ఆలయ నిర్మాణ పనుల పురోగతిని సీఎం కేసీఆర్‌ సమీక్షించి, నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌, డీసీపీ పరిశీలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story