CM KCR: యాదాద్రి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

CM KCR: ప్రధాన ఆలయంలో గోల్డ్ కలర్ లైటింగ్‌‌ను తిలకించిన సీఎం

Sandeep Eggoju
Updated on: 21 Jun 2021 9:00 PM IST
Chief Minister KCR Inspected the Yadadri Workers
X
సీఎం కెసిఆర్ యాదాద్రి పరిశీలన (ఫైల్ ఇమేజ్)

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ...యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. వరంగల్‌ పర్యటన ముగించుకుని, హెలికాప్టర్‌లో యాదాద్రి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్‌.... అనంతరం, ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన గోల్డ్ కలర్ లైటింగ్‌‌ను ఆసక్తిగా తిలకించారు. ఆలయం మొత్తం తిరుగుతూ పనులను పరిశీలించారు. ప్రతీ పని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలో జరుగుతోన్న అభివృద్ధి పనులను అధికారులు.... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story