ఇక చికెన్ తినాలంటే పర్సు చూసుకోవాల్సిందే మరి!

ఇక చికెన్ తినాలంటే పర్సు చూసుకోవాల్సిందే మరి!
x

chicken prices

Highlights

Chicken prices Hike : దేశంలో కరోనా వైరస్ మొదలైన సమయంలో చికెన్ తినాలంటే అందరూ భయపడ్డారు. జంతువుల ద్వారానే కరోనా ఎక్కువగా వస్తుందని ప్రచారం జరగడంతో చికెన్ అంటే ఆమడ దూరం పారిపోయారు జనాలు..

Chicken prices Hike : దేశంలో కరోనా వైరస్ మొదలైన సమయంలో చికెన్ తినాలంటే అందరూ భయపడ్డారు. జంతువుల ద్వారానే కరోనా ఎక్కువగా వస్తుందని ప్రచారం జరగడంతో చికెన్ అంటే ఆమడ దూరం పారిపోయారు జనాలు.. దీనితో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో వినియోగం పూర్తిగా తగ్గిపోయింది.. ధరలు కూడా భారీగా తగ్గిపోయాయి.. కొన్ని చోటల్లో అయితే ఫ్రీగానే కోళ్లను పంచిపెట్టారు కూడా..

అయితే చికెన్ తినడం వలన కరోనా రాదని, చికెన్ తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు, నిపుణులు, ప్రజాప్రతినిధులు సూచించడంతో మళ్లీ చికెన్ కి డిమాండ్ పెరిగిపోయింది... డిమాండ్ పెరిగిన ఉత్పత్తి లేకపోవడంతో వినియోగదారులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. ఈ టైంలో సామాన్యుడు చికెన్ తినాలంటే ఒక్కసారి పర్సు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రెండువారాల క్రితం కిలో చికెన్ ధర 170 రూపాయలు ఉండగా, ఇప్పుడు 220–230 రూపాయలకు చేరుకుంది. దీనితో చికెన్ ప్రియులు జేబులకు చిల్లు పడుతోంది. మరో వారం రోజుల తరవాత చికెన్ ధర 250 రూపాయలకి చేరుతుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి..

ఆదివారం కోడి లైవ్‌ ధర హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.122 ఉండగా, బహిరంగ మార్కెట్‌లో ధర రూ.132 నుంచి రూ.140 వరకు ఉంది. డ్రెస్డ్‌ చికెన్‌ ధర పెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌లో రూ.200 వరకు ఉండగా, స్కిన్‌లెస్‌ కిలో చికెన్‌ ధర రూ.220–230 గా ఉంది.. సాధారణ రోజుల్లో గ్రేటర్‌ వ్యాప్తంగా లక్ష కిలోల వరకు చికెన్‌ విక్రయాలు జరుగుతాయి. కేవలం గ్రేటర్ లోనే కాకుండా తెలంగాణ అంతటా ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు..

అటు కోడి గుడ్ల పరిస్థితి అలాగే ఉంది.. క్రమక్రమంగా ధర పెరుగుతూ వస్తోంది. గత వారంలో రూ.65 వరకు ఉన్న డజన్ కోడి గుడ్ల ధర ఇప్పుడు ఏకంగా రూ.80 వరకు చేరింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories