Chicken Rate Today: భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Chicken Prices Have Plummeted
x

Chicken Prices:(File Image)

Highlights

Chicken Rate Today: పెట్రోల్, డీజిల్ కంటే వేంగగా పెరిగిన చికెన్ ధర ప్రస్తుతం భారీగా పతనం అయ్యింది.

Chicken Rate Today: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులు చికెన్ ధరలు పెరుగుతూ, కొన్ని రోజులు భారీగా పతనం అవుతూ... అటూ చికెన్ వ్యాపారులు, ఇటు చికెన్ ప్రియులను అనేక ఇబ్బందులకు గురిచేసింది. గత కొద్ది రోజుల క్రితం బర్డ్‌ఫ్లూ ప్రచారంతో కొంతకాలంగా పడిపోయిన చికెన్ ధర మళ్లీ ఆకాశాన్నిఅంటాయి. పెట్రోల్, డీజిల్ కంటే వేగంగా చికెన్ రేట్లు పెరిగాయి. దీంతో చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని కిలో చికెన్ ధర రూ.250 వరకు వెళ్లిందంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. చికెన్ ధ‌ర భారీగా ప‌డిపోయింది. వారం రోజుల‌ క్రితం బాయిలర్‌ చికెన్‌ కిలో రూ.220 గా ఉండ‌గా, ఇప్పుడు అది రూ.140-150కి ప‌డిపోవ‌డం గ‌మ‌నార్హం. అంటే కిలోకి రూ.70-80 వ‌ర‌కు తగ్గింది.

ఆందోళనలో వ్యాపారులు...

అలాగే, కిలో రూ.120 ఉన్న ఫామ్‌గేట్‌ ధర ఇప్పుడు రూ.80కు దిగి వ‌చ్చింది. వేసవి కారణంగా 30 శాతం వ‌ర‌కు చికెన్‌ వినియోగం తగ్గిపోయింద‌ని వ్యాపారులు అంటున్నారు. ఆదివారం రోజుల‌ను మిన‌హాయిస్తే మిగ‌తా రోజుల్లో చికెన్ కొనుగోళ్లు అంత‌గా జ‌ర‌గ‌ట్లేదు. చికెన్ మాత్రమే కాదు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. హోల్‌సేల్‌గా 100 గుడ్ల ధ‌ర‌ రూ.50 నుంచి రూ.65 మ‌ధ్య ఉంది. టైల్‌గా ఒక‌ గుడ్డు రూ.5కి ల‌భిస్తోంది. ఎండలకు పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు అనారోగ్యం పాలవుతున్నాయ‌ని వ్యాపారులు చెబుతున్నారు. అంతేగాకుండా పౌల్ట్రీ ఫారాల్లో కరోనా ఉద్ధృతి నేప‌థ్యంలో కూలీల కొర‌త అధికంగా ఉండ‌డంతో పౌల్ట్రీలు స‌రిగ్గా న‌డ‌వ‌ట్లేదు. దీంతో ఉన్న కోళ్ల‌ను వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కు అమ్మేసుకుంటున్నారు. దీంతో చికెన్ ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. అటు వ్యాపారులు భారీ నష్టాలను చవి చూస్తుండగా, చికెన్ ప్రియులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories