Bomb in Tiffin Box: బాంబు వుందని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తే...!

Bomb in Tiffin Box: సిరిసిల్ల జిల్లా మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ కలకలం రేపింది.

Kranthi
Published on: 6 April 2021 5:05 PM IST
Chicken Feathers Found in Tiffin Box Instead of a Bomb Said by Telangana Police Department
X

Telangana Police: బాంబు వుందని టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తే

Bomb in Tiffin Box: మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున బలగాలను రంగంలోకి దించింది. చత్తీస్ గఢ్ అడవుల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తోంది. మరోవైపు వారిని అడ్డుకునేందుకు మావోయిస్టులు పావులు కదుపుతున్నారు. ఫలితంగా ఎన్ కౌంటర్లు అనివార్యమవుతున్నాయి. ఇరువైపులా నష్టం జరుగుతోంది. తాజాగా తర్రెమ్ ఎన్ కౌంటర్‌లో ఇదే జరిగింది. కానీ ప్రాణనష్టం భద్రతా దళాల వైపే ఎక్కువ జరిగింది. ఏప్రిల్ 3వ తేదీన బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 22 మంది జవాన్లు మృతి చెందారు.

మావోయిస్టుల కాల్పులతో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎక్కడ చిన్న అలజడి ఏర్పడినా పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలం వద్ద వాలిపోతున్నారు. తాజాగా సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మర్రిమడ్ల శివారులోని అటవీ ప్రాంతంలో టిఫిన్ బాక్స్ లో బాంబు ఉందంటూ సమాచారం రావడంతో పోలీసులు, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్ డిస్పోజల్ బృందం సభ్యులు ఆ ప్రాంతంలో క్షుణ్నంగా తనిఖీ చేపట్టారు. టిఫిన్ బాక్స్ ఉన్న ప్రాంతాన్ని జేసీబీ సహాయంతో లోతుగా తవ్వి సురక్షితంగా టిఫిన్ బాక్స్ ను వెలికితీశారు. ఇంకా ఏమైనా మందుపాతరలు ఉన్నాయేమోనని పోలీసులు ఆ ప్రాంతాన్ని జేసీబీతో తవ్వించారు. ప్రస్తుతం ఒక టిఫిన్ బాక్స్ మాత్రమే బయటపడింది. దాన్ని నిర్వీర్యం చేయగా పోలీసులు, డిస్పోజల్ బృందం సభ్యులు షాక్ కు గురయ్యారు. టిఫిన్ బాక్స్ లో బాంబుకు బదులు కోడి ఈకలు లభించాయి.

రాజన్న సిరిసిల్ల - నిజామాబాద్ జిల్లాల సరిహద్దు ప్రాంతం మర్రిమడ్ల, మానాల అటవీ ప్రాంతం గతంలో మావోయిస్టులు, జనశక్తి నక్సల్స్‌కు పట్టున్న ప్రాంతం. అప్పట్లో నక్సలైట్లు ఈ టిఫిన్ బాక్స్ ను పెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. టిఫిన్ బాక్స్ ను వెలికితీసిన పోలీసులు, ఎక్కడ ఎలాంటి మందుపాతరలు లభించకపోవ‌డంతో ఊపిరి పీల్చుకున్నారు.

Kranthi

Kranthi

Next Story