Cheruku Sudhakar: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన చెరుకు సుధాకర్‌

Cheruku Sudhakar: రాహుల్ గాంధీ పడుతున్న శ్రమ వృధా అవుతుంది

Shekhar G
Published on: 20 Oct 2023 4:25 PM IST
Cheruku Sudhakar Resigned From The Congress Party
X

Cheruku Sudhakar: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన చెరుకు సుధాకర్‌

Cheruku Sudhakar: కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌ నేత చెరుకు సుధాకర్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి రాజీనామా లేఖ రాసిన సుధాకర్‌.. ఉద్యమకారులు, బీసీలకు కాంగ్రెస్‌లో ప్రాధాన్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగడాలు పెరిగాయని.. అయినా టీపీసీసీ చీఫ్‌గా ఆయన్ను నిలవరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. సామాజిక న్యాయం అని రాహుల్, ప్రియాంక చెబుతున్నా.. ఆచరణలో మాత్రం జరగడం లేదన్నారు. ఫస్ట్ లిస్టులో 55 టికెట్లు ప్రకటిస్తే బీసీలకు కేవలం 12 టికెట్లు మాత్రమే ఇచ్చారని.. అది కూడా కాంగ్రెస్ ప్రభావం లేని హైదరాబాద్‌ ప్రాంతంలో ఇచ్చి అవమానించారన్నారు చెరుకు సుధాకర్. ఇప్పటికైనా కాంగ్రెస్‌ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని.. బలహీన వర్గాల నాయకుల మనోభావాలు గుర్తించకపోతే రాహుల్ గాంధీ పడుతున్న శ్రమ వృధా అవుతుందని లేఖలో పేర్కొన్నారు.

Shekhar G

Shekhar G

Next Story