Top
logo

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న టీఆర్ఎస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డి
X
Highlights

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి నేడు సాయంత్రం కాంగ్రెస్...

టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి నేడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. తండ్రి ముత్యంరెడ్డితో కలిసి 2018 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎ్‌సలో చేరిన శ్రీనివా్‌సరెడ్డి కొన్నాళ్లుగా ఆ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తామని టీపీసీసీ.. శ్రీనివాస్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు సమాచారం.

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. ముత్యంరెడ్డికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇస్తానని కేసీఆర్ ఆ సమయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది. అయితే ఎన్నికల అనంతరం ముత్యం రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి శ్రీనివాస్ రెడ్డి పెద్దగా టీఆర్ఎస్ కార్యక్రమాలకు ఆహ్వానించకుండా దూరం పెడుతున్నారని ఆయన వర్గం అసంతృప్తితో ఉంది.


Web TitleCheruku Srinivas Reddy to join Congress
Next Story