విజయారెడ్డి ఆత్మహత్య కేసు: అసత్య ప్రచారంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం.. యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!

Hyderabad: చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Arun Chilukuri
Published on: 7 Feb 2026 4:37 PM IST
విజయారెడ్డి ఆత్మహత్య కేసు: అసత్య ప్రచారంపై కుటుంబ సభ్యుల ఆగ్రహం.. యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా!
X

Hyderabad: చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషాద సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తన సోదరి మరణంపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని విజయారెడ్డి సోదరుడు చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అసత్య ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు: శనివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న చిరంజీవి, తన సోదరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న ఛానెళ్లపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "విజయారెడ్డి, పిల్లలు చేతనరెడ్డి, విశాల్‌రెడ్డి మృతితో మా కుటుంబం కుంగిపోయింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆమె మరణం వెనుక ఇప్పటివరకూ మాకు ఎటువంటి అనుమానాలు లేవు. కానీ, కొన్ని ఛానెళ్లు ఇష్టమొచ్చినట్లు కథనాలు అల్లుతున్నాయి. వారిపై హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తాం" అని హెచ్చరించారు.

మరోవైపు, విజయారెడ్డి కేవలం డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తలను పోలీసులు ప్రాథమికంగా ఖండించారు. ముగ్గురి ఆత్మహత్యకు అసలు కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేశారు.

కేసు దర్యాప్తు దశలో ఉన్నందున, అన్ని కోణాల్లో ఆధారాలు సేకరించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story