Hyderabad: స్విగ్గీ డెలివరీ బాయ్ చేతిలో హత్యకు గురైన చెఫ్ ఆదిత్య

Hyderabad: వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన ఆదిత్య

Jyothi
Published on: 16 Sept 2022 1:24 PM IST
Chef Adithya was Murdered By Swiggy Delivery Boy
X

Hyderabad: స్విగ్గీ డెలివరీ బాయ్ చేతిలో హత్యకు గురైన చెఫ్ ఆదిత్య

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. స్విగ్గీ డెలివరీ బాయ్ చేతిలో చెఫ్ ఆదిత్య హత్యకు గురయ్యారు. వారం రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫుడ్ డెలివరీ ఆలస్యమవ్వడంతో చెఫ్ ఆదిత్య, స్విగ్గీ డెలివరీ బాయ్‌ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన స్విగ్గీ బాయ్... ఆదిత్యను కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆదిత్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్విగ్గీ డెలివరీ బాయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Jyothi

Jyothi

Next Story