Cheetah: ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం

X
Highlights
Cheetah: గుడిహత్నూర్‌లో రోడ్డు దాటుతున్న చిరుత * దృశ్యాలు సెల్‌ఫోన్‌లో బంధించిన ప్రయాణికుడు
Sandeep Eggoju8 April 2021 4:14 AM GMT
Cheetah: ఆదిలాబాద్ జిల్లాలో చిరుతపులి కలకలం రేగింది. గుడిహత్నూర్‌లో మెరుపు వేగంతో చిరుత రోడ్డు దాటుతున్న దృశ్యాన్ని కారులో వెళ్తున్న ఓ వ్యక్తి.. తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు.. చిరుత సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు.. ఎక్కడి నుంచి వచ్చి.. చిరుత దాడి చేస్తుందోననే భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికైనా అధికారులు.. చిరుతను బంధించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Web TitleCheetah Wandering in Adilabad District
Next Story