Hyderabad: మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

Cheddi Gang In Miyapur Vasant Vilas Hyderabad
x

Hyderabad: మళ్లీ చెడ్డీ గ్యాంగ్ కలకలం.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు

Highlights

Hyderabad: సీసీ ఫుటేజీని ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు

Hyderabad: హైదరాబాద్ మియాపూర్ వసంత విలాస్‌లో చెడ్డీ గ్యాంగ్ సభ్యులు హల్ చల్ చేశారు. తాళం వేసి ఉన్న విల్లాలోకి దుండగులు చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన జరగ్గా పోలీసులు గోప్యంగా ఉంచారు. సీసీ టీవీ ఫుటేజీ గమనించడంతో దోపిడీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామచంద్రపురంలో కూడా ఈ చెడ్డీ గ్యాంగ్ సభ్యులే చోరీకి పాల్పడినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు.. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి నిందితులను పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చెడ్డీ గ్యాంగు సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మాదాపూర్ ఎస్‌వోటీ, సీసీఎస్, క్రైమ్ బృందాలు చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నాయి. మియాపూర్, రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories