వెలుగులోకి టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్‌ నిర్వాకం..

Cheating Case Filed Against Trainee IAS Officer
x

వెలుగులోకి టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కొడుకు, ట్రైనీ ఐఏఎస్‌ నిర్వాకం..

Highlights

Trainee IAS Officer: ఖమ్మం జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం బయటపడింది.

Trainee IAS Officer: ఖమ్మం జిల్లాకు చెందిన ట్రైనీ ఐఏఎస్ నిర్వాకం బయటపడింది. ట్రైనీ ఐఏఎస్, వైరా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు మృగేందర్‌ లాల్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. గతంలో మృగందర్ లాల్‌ ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆ సమయంలో తనకు కజిన్ అవుతానంటూ ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకొని తరువాత ప్రేమ పేరుతో తనకు దగ్గరయ్యాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.

తనను పోలీస్‌ అకాడమీకి పిలిపించి తన గదిలోనే పలుమార్లు లైంగికంగా దాడిచేసినట్లు యువతి పేర్కొంది. చివరికి పెళ్లి చేసుకోవాలని అడిగితే ముఖం చాటేస్తున్నాడని వాపోయింది. ప్రస్తుతం మధురైలో ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న మృగేందర్‌ లాల్ మరో ఐఏఎస్‌తో పెళ్లికి సిద్ధమయ్యాడని తెలిపింది. తన కొడుకును మరచిపోవాలని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ బెదిరించాడరని కూకట్‌పల్లి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories