శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గందరగోళం

ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెతడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 12:32 PM IST
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గందరగోళం
X

ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం తలెతడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో గందరగోళం నెలకొంది. ముంబై, అహ్మదాబాద్ , బెంగళూరు, చెన్నై,..ఢిల్లీ వెళ్లాల్సిన ఇండిగో ఫైట్లలో అంతరాయం ఏర్పడింది. దీంతో నిన్నటి నుంచి ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తూ...నిరీక్షించారు. విదేశాలకు వెళ్లవలసిన ప్రయాణికుల కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యింది. వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లవలసిన వారు ఇండిగో ఉద్యోగులతో గొడవ పడ్డారు. వారికి సమాధానం చెప్పలేక ఇండిగో సిబ్బంది ఇబ్బంది పడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story