NTR Birth Anniversary: ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి- చంద్రబాబు

NTR Birth Anniversary: ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు.

Arun Chilukuri
Published on: 28 May 2021 11:09 AM IST
Chandrababu Pays Tribute to the late Nandamuri Taraka Rama Rao at NTR Ghat
X

NTR Birth Anniversary: ఆయన ఒక వ్యక్తి కాదు.. ఒక శక్తి- చంద్రబాబు

NTR Birth Anniversary: ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయనకు టీడీపీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తెలుగువారి ఆస్తి అన్నారు చంద్రబాబు. ఆయన ఒక వ్యక్తి కాదని, ఒక శక్తన్నారు. ఆయన సాధించిన విజయాలు భవిష్యత్‌లో ఎవరూ సాధించలేదన్నారు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే సాధించే వరకు వెనక్కి వెళ్లరని బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ చిరస్మరనీయంగా నిలుస్తారన్నారు. ఆయన తెలుగువారి గుండెల్లో నిలిచిన వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. రాజకీయాల్లో అనతికాలంలోనే ప్రజలకు ఏం కావాలో చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.


ఎన్టీఆర్ 98 జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఎప్పుడూ మనతోనే ఉంటారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ బతికుంటే ఏపీ పరిస్థితి చూసి చలించిపోయేవారన్నారు. వనరులు లేకపోయినా చంద్రబాబు అద్భుతంగా పాలించారన్నారు. జగన్ పాలనలో ఏపీ ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ స్పూర్తితో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీని బలోపేతం చేస్తామన్నారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలనేది తన డిమాండ్ అన్నారు. ఆయన జీవిత మూలాలు భవిష్యత్‌ తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని బాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని బాలకృష్ణ వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story