Chandrababu Naidu: ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఫైర్.. సీఎస్ కి లేఖ

Chandrababu Naidu: అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వాకాలు చేస్తున్నారు

Dhatripriya
Published on: 26 April 2023 10:53 AM IST
Chandrababu Naidu Letter To CS Jawahar Reddy On Sand Mafia
X

Chandrababu Naidu: ఇసుక అక్రమ రవాణాపై చంద్రబాబు ఫైర్.. సీఎస్ కి లేఖ 

Chandrababu Naidu: ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాలు సార్లు ఫిర్యాదు చేశామని...అయినా ఆయా ఫిర్యాదులపై తగు రీతిలో స్పందించి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని...అధికార వైసీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story