తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. యాక్షన్‌ ప్లాన్‌ తయారు...

Chandrababu Naidu: తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్న చంద్రబాబు...

Shireesha
Published on: 30 April 2022 12:25 PM IST
Chandrababu Naidu Focusing on Telangana TDP | NTR Bhavan | Live News
X

తెలంగాణలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు.. యాక్షన్‌ ప్లాన్‌ తయారు...

Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తెలంగాణలో బలహీనంగా ఉన్న పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు వస్తున్నారు చంద్రబాబు. సాయంత్రం 4 గంటలకు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకోనున్న చంద్రబాబు..తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ కానున్నారు.

రాష్ట్రంలో మందకొడిగా జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చంద్రబాబు చర్చించనున్నారు. మహానాడులోపు పూర్తిస్థాయిలో సభ్యత్వం చేయాలని గతంలోనే ఆదేశించారు చంద్రబాబు. అయితే ఖమ్మం, హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా మిగతా పార్లమెంట్లలో సభ్యత్వం కార్యక్రమంపై నేతలు ఆసక్తి చూపడంలేదు. అయితే సభ్యత్వ నమోదుపై తెలంగాణ నేతలకు చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు.

Shireesha

Shireesha

Next Story