Schools Reopen: తెలంగాణలో స్కూళ్లు రీఓపెన్‌..?

Schools Reopen: సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు తెరుచుకునే అవకాశం * 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

Sandeep Eggoju
Updated on: 13 Aug 2021 8:14 PM IST
Chance To Reopen  Schools in Telangana From September 1st
X

తెలంగాణలో సెప్టెంబర్ 1st నుంచి స్కూల్స్ తెరిచే ఛాన్స్ (ఫైల్ ఇమేజ్)

Schools Reopen: తెలంగాణలో త్వరలో స్కూళ్లు రీఓపెన్‌ కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 1 నుంచి స్కూళ్లు తెరుచుకునే అవకాశం ఉంది. 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష బోధనకు సర్కార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. స్టేటస్‌ రిపోర్టును సీఎం కేసీఆర్‌కు పంపింది విద్యాశాఖ. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, విద్యార్థులకు ప్రమాదంలేదని నివేదిక ఇచ్చారు.

ఇక పలు రాష్ట్రాల్లో తరగతుల ప్రారంభంపై సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లారు విద్యాశాఖ. తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదంటున్నారు విద్యాశాఖ అధికారులు. స్కూల్స్‌ తెరవమని ఇప్పటికే పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ సూచించింది. ఇదే అంశంపై రేపు లేదా సోమవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు సమావేశంకానున్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story