Assembly: రేపు అసెంబ్లీలో పీఆర్సీపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేసే ఛాన్స్‌

Assembly: ఉద్యోగులకు 29శాతం పీఆర్సీ ఇచ్చే అవకాశం * ఉద్యోగ సంఘాల నేతలను లంచ్‌కు ఆహ్వానించిన సీఎం

Sandeep Eggoju
Published on: 21 March 2021 1:45 PM IST
Chance to Give the Statement On PRC Tomorrow in Assembly
X

సీఎం కెసిఆర్ (ఫైల్ ఫోటో)

Assembly: రేపు అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ పీఆర్సీపై కీలక ప్రకటన చేయనున్నారు. ఉద్యోగులకు 29శాతం పీఆర్సీ ఇచ్చే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతిభవన్‌కు లంచ్‌కు ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. లంచ్‌ అనంతరం పీఆర్సీపై వారితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్సీలు పల్లా, వాణిదేవిని కూడా లంచ్‌కు ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. ఇంకోపక్క పల్లా విజయానికి అహర్నిశలు కృషి చేసిన ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ ప్రజాప్రతినిధులు కేసీఆర్‌ను కలవనున్నారు. ఈ భేటీ అనంతరం పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ రివ్యూ నిర్వహిస్తారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story