Telangana Rains: నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Chance Of Rain In Telangana For Two Days
x

Telangana Rains: నేడు, రేపు తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Highlights

Telangana Rains: మంగళ, బుధవారం తెలంగాణలో కురిసిన భారీ వర్షం

Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ దిశల నుంచి బంగాళఖాతం మీదుగా రాష్ట్ర వైపు గాలుల వీస్తుండమే ఈ వర్షాలకు కారణమని పేర్కొంది. మరోవైపు మంగళవారం నుంచి బుధవారం వరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. జనగామ జిల్లాలోని దేవరుప్పులలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగు పడటంతో కోహీర్ మండలంలోని ఎక్కల్‌దేవికుంటలో ఓ మహిళ మృతి చెందింది. కాగా నిన్న, మొన్న సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌లో భాగ్యనగర వాసులు ఇబ్బందులు పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories