తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవేకు లైన్ క్లియర్

Arun Chilukuri
Published on: 27 Oct 2020 8:42 AM IST
తెలుగు రాష్ట్రాల మధ్య నేషనల్ హైవేకు లైన్ క్లియర్
X

తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం అనుమతినిచ్చింది. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని కరివేన వరకు 122కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ అనుమతి ఇచ్చింది. ఈ నూతన జాతీయ రహదారితో హైదరాబాద్‌ నుంచి తిరుపతికి 80కిలోమీటర్ల దూరం తగ్గనుంది. కల్వకుర్తి, నాగర్ కర్నూల్ , కొల్లాపూర్, ఆత్మకూరు, నంద్యాల నియోజకవర్గాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టనుంది. భారతమాల పథకం కింద జాతీయ రహదారికి అనుమతి ఇచ్చిన కేంద్ర రవాణా శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణం కూడా ఏర్పాటు కానుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 800కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. 86 కిలోమీటర్లు తెలంగాణలోనూ, 26 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం జరుగుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story