Medak: కేంద్ర మంత్రికి అవమానం.. గెస్ట్ హౌస్ తాళం ఇవ్వని అధికారులు.. తాళం పగులగొట్టిన..

Central Minister Sanjeev Kumar Balyan Sensational Comments On Telangana Government In Medak
x

Medak: కేంద్ర మంత్రికి అవమానం.. గెస్ట్ హౌస్ తాళం ఇవ్వని అధికారులు.. తాళం పగులగొట్టిన..

Highlights

Medak: మెదక్‌ జిల్లాలో కేంద్రమంత్రి సంజీవ్‌కుమార్‌కు అవమానం జరిగింది.

Medak: మెదక్‌ జిల్లాలో కేంద్రమంత్రి సంజీవ్‌కుమార్‌కు అవమానం జరిగింది. కేంద్రమంత్రి వచ్చినా అధికారులు, ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ తాళం తియ్యలేదు. దీంతో బీజేపీ నేతలు తాళం పగలగొట్టి కేంద్రమంత్రిని గెస్ట్‌హౌస్‌లోకి తీసుకెళ్లారు. గెస్ట్‌హౌస్‌లోపల తాగడానికి నీరు కూడా లేకపోవడంపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సంజీవ్ తెలంగాణ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం లో అవినీతి ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో, దేశంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ పథకాలను తెలంగాణ లో అమలు చేయడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి లో ముందుకు సాగుతోందన్నారు కేంద్ర మంత్రి.

Show Full Article
Print Article
Next Story
More Stories