Top
logo

టీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌..

టీఆర్ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌..
X
Highlights

Kishanreddy: ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి...

ప్రభుత్వ వైఫల్యాలే ప్రధాన అజెండాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. బీజేపీకి ప్రజల మద్దతు బలంగా ఉందని మహిళలు, యువత బీజేపీ పక్షాన ఉన్నారన్నారు. ప్రజల కోరుకుంటున్న మార్పు బీజేపీతోనే సాధ్యమని కిషన్‌ రెడ్డి చెప్పారు. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీఆర్ఎస్‌ కుట్రలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతామని కిషన్‌ రెడ్డి తెలిపారు. దేశంలో కాంగ్రెస్‌ మునిగిపోయిన పార్టీ అని విమర్శించారు. జాతీయ పార్టీని నడపలేక రహుల్‌ గాంధీ చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదని ఆ పార్టీ నేతలు బీజేపీకిలో వస్తున్నారని చెప్పారు.

Web TitleCentral Minister Kishanreddy fire on TRS
Next Story