ఇవాళ కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కీలక సమావేశం

Nagarjuna Sagar Project: తెలుగురాష్ట్రాల అధికారులతో కేంద్రజలశక్తిశాఖ భేటీ

Jyothi
Published on: 2 Dec 2023 9:54 AM IST
Central Meeting on Krishna Water Dispute Today
X

ఇవాళ కృష్ణా జలాల వివాదంపై కేంద్రం కీలక సమావేశం

Nagarjuna Sagar Project: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల నీటి పంచాయితీపై నేడు కేంద్ర జలశక్తి శాఖ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు శ్రమ శక్తి భవన్‌లో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సీఎస్‌లు, KRMB చైర్మన్‌తో జలశక్తి శాఖ కార్యదర్శి భేటీ కానున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద ఉద్రిక్తతలు, తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాల సమస్యలపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు చర్చించనున్నారు.

Jyothi

Jyothi

Next Story