విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం

Central Home Ministry: విభజన సమస్యలపై ఈనెల 23న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది.

Arun Chilukuri
Published on: 8 Nov 2022 3:39 PM IST
Central Home Ministry Meeting On 23rd Over Ap Partition Issues
X

విభజన సమస్యలపై ఈ నెల 23న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం

Central Home Ministry: విభజన సమస్యలపై ఈనెల 23న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఏపీ, తెలంగాణ అధికారులకు కేంద్రం అధికారికంగా సమాచారం అందించింది. 23వ తేదీ సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విభజన సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించాలని నిర్ణయించిన కేంద్రం వెనుకబడిన జిల్లాలకు నిధులు, లోటు భర్తీ, అమరావతికి నిధులు తదితర అంశాలను ఎజెండాలో చేర్చినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో వివిధ కేంద్రశాఖల కార్యదర్శులు పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story