TS News: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు

TS News: ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై కేంద్రం సీరియస్

Jyothi
Updated on: 28 Nov 2022 12:55 PM IST
Central Government Notices to Telangana Govt
X

TS News: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు

TS News: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై సీరియస్‌ అయిన కేంద్రం.. దారి మళ్లించిన 152 కోట్ల రూపాయలను చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. రెండు రోజుల్లోగా ఈ నిధులు చెల్లించాలని ఆదేశించింది. లేకుంటే తదుపరి వాయిదాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. గత జూన్‌లో తెలంగాణను సందర్శించిన కేంద్ర బృందాలు.. ఉపాధి హామీ పథకం నిధులను అనుమతి లేని పథకాలకు మళ్లించినట్లు గుర్తించాయి. ఉపాధి హామీ పథకం అమలు, పనుల కేటాయింపులో పలు అవకతవకలు జరిగినట్లు కేంద్రం నిర్ధారణకు వచ్చింది.

Jyothi

Jyothi

Next Story