BJP: తెలంగాణలో బీజేపీపై దాడులను సీరియస్ గా పరిశీలిస్తున్న కేంద్రం

BJP: రెండు రోజులుగా బండి సంజయ్ యాత్ర నేపధ్యంలో ఘర్షణలు

Sandeep Eggoju
Updated on: 16 Nov 2021 7:44 PM IST
Center is seriously Considering the Attacks on the BJP in Telangana
X
తెలంగాణలో బీజేపీ పై ఎటాక్ ను సీరియస్ గా తీసుకున్న కేంద్రం (ఫైల్ ఇమేజ్)

BJP: తెలంగాణలో బీజేపీ, వర్సెస్ టీఆర్ఎస్ మధ్య దాడులను కేంద్ర హోం శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.. గత రెండురోజులుగా బండి సంజయ్ పర్యటనల నేపధ్యంలో జరుగుతున్న దాడులపై నిఘా వర్గాల నుంచి అదనపు సమాచారం కేంద్ర హోం శాఖ తెప్పించుకుంటోంది. తమపై దాడులు జరుగుతున్నాయని బీజేపి హై కమాండ్ కు స్థానిక నేతలు ఇప్పటికే కంప్లయింట్ చేశారు. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం పోతోందని, తమకు కేంద్ర భద్రతా సంస్థలతో రక్షణ కల్పించాలని తెలంగాణ నేతలు కోరుతున్నారు.

బండి సంజయ్ పర్యటన ఘర్షణలు,వరంగల్లో తన పర్యటనపై జరిగిన దాడుల వివరాలను అధక్షుడునడ్డా దృష్టికి ఎంపీ అర్వింద్ ఇప్పటికే తీసుకెళ్లారు. అయితే హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడతాననినడ్డా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి రక్షణ కోసం ఆ రాష్ట్ర బీజేపి నేతలకు కేంద్ర భద్రతా సంస్థలతో భద్రత కల్పించారు. తమకు కూడా అదే తీరులో అదనపు భద్రత కల్పించాలని బీజేపి నేతలు కోరుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story