Telangana Secretariat: సచివాలయంలో కంటి వెలుగు సంబరాలు.. కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు

Secretariat: హాజరైన మంత్రులు హరీష్, ప్రశాంత్, శ్రీనివాస్, జగదీష్ కేక్‌కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

Dhatripriya
Updated on: 17 Jun 2023 4:10 PM IST
Celebrations In Secretariat
X

Secretariat: సచివాలయంలో కంటి వెలుగు సంబరాలు.. కోటి 61 లక్షల మందికి కంటి పరీక్షలు

Secretariat: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కంటి వెలుగు సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్ పాల్గొ్న్నారు. వంద రోజులు పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి. అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. కంటి వెలుగు పథకం విజయవంతంగా వంద రోజులు పూర్తి చేయడం పట్ల మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. అనుకున్న లక్ష్యాని కంటే. ఎక్కువగానే కంటి పరీక్షలు చేయడం జరిగిందన్నారు హరీష్. గ్రామాలకు వైద్య సిబ్బంది వచ్చి, ఉచితంగా పరీక్షలు నిర్వహించి, అద్దాలు అందించే కార్యక్రమం ప్రపంచంలో తెలంగాణలో మినహా మరెక్కడా లేదన్నారాయన.

Dhatripriya

Dhatripriya

Next Story