CBI: మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవికి సీబీఐ నోటీసులు

* రేపు ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవి

R Tripura Malini
Updated on: 30 Nov 2022 1:12 PM IST
CBI notices to Minister Gangula And MP Gayatri Ravi
X

 మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవికి సీబీఐ నోటీసులు

Central Bureau Of Investigation: నకిలీ సీబీఐ అధికారి అరెస్ట్‌ వ్యవహారంలో మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. విట్నెస్‌ స్టేట్‌మెంట్‌ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. గంగులతో పాటు కరీంనగర్‌లో మరికొందరనికి కూడా నోటీసులు జారీ చేసింది. దీంతో రేపు ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి మంత్రి గంగుల, ఎంపీ గాయత్రి రవి వెళ్లనున్నారు. మూన్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో నకిలీ సీబీఐ ఆఫీసర్‌ను కలిసిన వారందకిరీ సీబీఐ నోటీసులు జారీ చేస్తోంది. అయితే ఓ ఫంక్షన్‌లో మంత్రి గంగుల, ఎంపీ రవితో నకిలీ సీబీఐ అధికారి ఫొటో దిగగా.. రెండు రోజుల క్రితం ఆయనను అరెస్ట్ చేశారు. నకిలీ సీబీఐ అధికారి ఫోన్‌ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story