ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 23 Feb 2024 4:33 PM IST
CBI has Made MLC Kavitha an Accused in Delhi Liquor Scam Case
X

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు.. ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేర్చిన సీబీఐ

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో నిందితురాలిగా చేర్చింది. ఇటీవలే ఈ కేసులో కవితకు నోటీసులిచ్చిన సీబీఐ.. ఈనెల 26న విచారణకు రావాలని ఆదేశాలిచ్చింది. మరి కవిత సీబీఐ విచారణకు ఢిల్లీకి వెళ్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గతంలో హైదరాబాద్‌ వచ్చి కవితను ఆమె ఇంట్లో విచారించారు. ఈడీ అధికారులు మాత్రం రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి.. అక్కడ ఆమెపై ప్రశ్నలు గుప్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story