హైదరాబాద్‌లో పోలీసులకు దమ్కీ ఇచ్చినవారిపై కేసులు నమోదు

Cases Registered Against those  Threatened the Police in Hyderabad
x

హైదరాబాద్‌లో పోలీసులకు దమ్కీ ఇచ్చినవారిపై కేసులు నమోదు

Highlights

Hyderabad: ముషీరాబాద్ ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

Hyderabad: హైదరాబాద్ పోలీసులకు దమ్కీ ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేశారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన వెంటనే నిందితులపై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడం విశేషం. ముషీరాబాద్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బోలక్‌పూర్‌లో నిన్న అర్దరాత్రి దాటిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు, ఎమ్ఐఎమ్ కార్పొరేటర్ పోలీసులపై రెచ్చిపోవడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మజ్లిస్‌ నేతలపై టీఆర్ఎస్ సర్కార్ చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతుందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. నెటిజన్ల నుంచి కూడా కామెంట్స్ రావడంతో స్పందించిన కేటీఆర్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. ఎట్టకేలకు నిందితులపై చర్యలకు ప్రభుత్వం, పోలీసులు చర్యలకు ఉపక్రమించడంతో వివాదం సద్దుమణిగినట్లైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories