పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ మనవడిపై గృహ హింస కేసు.. భార్య బయటకు రాకుండా గోడ కట్టేసి..

Pulla Reddy Sweets: పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గృహహింస కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 14 May 2022 4:27 PM IST
Case Registered Against Pulla Reddy Eknath Reddy
X

పుల్లారెడ్డి స్వీట్స్ ఓనర్ మనవడిపై గృహ హింస కేసు.. భార్య బయటకు రాకుండా గోడ కట్టేసి..

Pulla Reddy Sweets: పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో గృహహింస కేసు నమోదైంది. ఎక్ నాథ్ రెడ్డి భార్యకు గత కొంత కాలంగా కుటుంబకలహాలు కొనసాగుతున్నాయి. ఇక, గత కొంతకాలంగా ఏక్‌నాథ్ రెడ్డి, ప్రగ్యారెడ్డి దంపతుల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఏక్‌నాథ్ అడ్డుకున్నాడు. వారుంటున్న భవనంలోని పైఅంతస్తు నుంచి తన భార్య కిందకు రాకుండా బంధించాలని ఏక్​నాథ్​ రెడ్డి తలచాడు. రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించాడని తెలుస్తోంది. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story