గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Case Against Rajasingh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 12:04 PM IST
Case Booked Against BJP MLA Raja Singh in Hyderabad
X

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Case Against Rajasingh: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది. యూపీ ఎన్నికల సందర్భంగా రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రాజాసింగ్‌పై వెంటనే FIR నమోదు చేయాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగళ్‌హాట్ పోలీసులు, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేశామని మంగళ్ హాట్ పోలీసులు తెలిపారు. ప్రెస్‌మీట్లు, ర్యాలీలు, బహిరంగ సభల నిర్వహణపై సైతం నిషేధం విధించింది ఈసీ. వివిధ రకాల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనకుండా రాజాసింగ్‌పై 72 గంటలపాటు నిషేధం విధించింది ఈసీ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story