Hyderabad: ఐటీ కంపెనీ సీఈవో లైంగిక వేధింపులు.. మధురానగర్ పీఎస్‌లో ఎన్‌ఆర్ఐపై కేసు..

Case Against NRI In Hyderabad Madhura Nagar PS
x

Hyderabad: ఐటీ కంపెనీ సీఈవో లైంగిక వేధింపులు.. మధురానగర్ పీఎస్‌లో ఎన్‌ఆర్ఐపై కేసు.. 

Highlights

Hyderabad: ఇండియాకు వచ్చి తనను వేధిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

Hyderabad: అమెరికాలో పనిచేస్తున్న టెకీపై హైదరాబాద్‌ మధురానగర్‌ పీఎస్‌‌లో కేసు నమోదు అయింది. అమీర్‌పేట్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో హెచ్‌ఆర్ అండ్ లీగల్ మేనేజర్‌గా పనిచేస్తున్న యువతి... తాను పనిచేస్తున్న పెనీ సీఈఓ తనను వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్ఫో గ్రావిటీ కంపెనీ సీఈవో టి.చంద్ర అమెరికాలో ఉంటున్నాడు. అదే కంపెనీలో సదరు యువతి ఇండియా మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆఫీస్ జూమ్ మీటింగ్‌లో యువతిని చూసిన చంద్ర ప్రేమిస్తున్నానంటూ వేధింపులుకు గురి చేసినట్లు తెలుస్తోంది.

గతేడాది డిసెంబర్ 22న అమెరికా నుంచి వచ్చిన చంద్ర... యువతికి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. అందుకు తిరస్కరించడంతో లైగింగా వేధింపులకు గురిచేసినట్లు యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తాను ఉద్యోగానికి రాజీనామా చేసినా..వేధింపులు ఆగడం లేదని.. రిలీవింగ్ లెటర్, ఎక్స్ పీరియన్స్ లెటర్‌లు ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories