Siddipet: బావిలోకి దూసుకెళ్లిన కారు.. సహాయక చర్యల్లో విషాదం

Siddipet: సిద్దిపేట కారు ప్రమాదం ఘటనలో విషాదం నెలకొంది.

Arun Chilukuri
Published on: 1 Dec 2021 9:13 PM IST
Car Plunges into Agricultural Well in Siddipet
X

Siddipet: బావిలోకి దూసుకెళ్లిన కారు.. సహాయక చర్యల్లో విషాదం

Siddipet: సిద్దిపేట కారు ప్రమాదం ఘటనలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందగా.. సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాడు మరణించడం విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్న గజ ఈతగాళ్లు కారును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. వీరిలో ఒకరు కారుకు తాడు కట్టి లాగే క్రమంలో కారులోనే చిక్కుకుని మరణించారు. మృతుడు ఎనగుర్తి గ్రామానికి చెందిన నర్సింలుగా గుర్తించారు. మరోవైపు కారు బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మరణించారు. మృతులు మెదక్ జిల్లా నందిగామకు చెందిన ప్రశాంత్, తల్లి భాగ్యలక్ష్మిగా గుర్తించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story