Hyderabad: వేగంగా వచ్చి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Car Crashed Into Hussain Sagar At NTR Park in Hyderbad
x

Hyderabad: వేగంగా వచ్చి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు

Highlights

* హైదరాబాద్ ఎన్టీఆర్‌ పార్క్ వద్ద కారు బీభత్సం * కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్పగాయాలు

Hyderabad: హైదరాబాద్‌ ఎన్టీఆర్ పార్క్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సైఫాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను యశోద ఆస్పత్రికి తరలించారు. వీరంతా ఖైరతాబాద్‌కు చెందిన నితన్, స్పత్రిక్, కార్తీక్‌గా గుర్తించారు. కారును నాలుగు రోజుల క్రితమే తీసుకున్నారని, ఖైరతాబాద్ నుంచి అఫ్జల్‌గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories