Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారు బోల్తా.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్ సమీపంలో గల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Arun Chilukuri
Published on: 15 Sept 2025 11:52 AM IST
Car Accident on Hyderabad Outer Ring Road One Infosys Employee Dead Seven Injured
X

Hyderabad: ఓఆర్‌ఆర్‌పై కారు బోల్తా.. ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేట్ సమీపంలో గల ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులుగా పోలీసులు గుర్తించారు. వీరు సరళమైసమ్మ దేవాలయాన్ని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story