రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు బీభత్సం.. వేములవాడ తిప్పాపూర్ వంతెనవద్ద రోడ్డు ప్రమాదం

* పరారీలో కారు డ్రైవర్, ప్రముఖ టీఆర్ఎస్ నేతగా అనుమానం.. డ్రైవర్ తాగిన మత్తులో ఉన్నట్లు సమాచారం

R Tripura Malini
Published on: 23 Nov 2022 7:11 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు బీభత్సం.. వేములవాడ తిప్పాపూర్ వంతెనవద్ద రోడ్డు ప్రమాదం
X

Road Accident: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారు బీభత్సం సృష్టించింది. వేములవాడ తిప్పాపూర్ ‌వంతెనవద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనున్న మొబైల్‌ టిఫిన్ సెంటర్లోకి క్రెటా కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం చేరుకున్నారు. స్థానికుల సాయంతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారయ్యాడు. కారు యజమాని ప్రముఖ టీఆర్ఎస్ నేతగా అనుమానిస్తున్నారు. డ్రైవర్ తాగిన మత్తులో ఉండటంతో ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story