హైదరాబాద్ చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరి మృతి

Hyderabad: అతివేగంతో కమాన్ దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడ్డ కారు

Jyothi
Published on: 18 Dec 2023 11:17 AM IST
Car Accident in Chaitanyapuri Hyderabad
X

హైదరాబాద్ చైతన్యపురిలో కారు బీభత్సం.. ఒకరి మృతి 

Hyderabad: హైదరాబాద్‌లోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళ్తూ రాజీవ్‌గాంధీ నగర్‌లోని కమాన్ వద్ద దిమ్మెను ఢీకొట్టి బోల్తాపడింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కర్ణాకటకు చెందిన రోజు కూలీ చైతేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎమ్మార్వో హరికృష్ణదిగా పోలీసులు గుర్తించారు.

ప్రమాద సమయంలో కారులో ఎమ్మార్వో కుమారుడు సాయికార్తీక్ డ్రైవింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. సాయికార్తీక్‌తో పాటు కారులో మరో ఆరుగురు తన స్నేహితులు గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా ఏడుగురిని వివిధ ఆస్పత్రులకు తరలించిన చికిత్స అందిస్తున్నారు. అయితే యువకులు అందరూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story