Telangana: లాక్ డౌన్ మరో పది రోజులు?

Telangana: కరోనా కేసులు, లాక్ డౌన్‌ పై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రగతి భవన్ లో కేసీఆర్ అధ్యక్షత‌న మంత్రివర్గం సమావేశం కానుంది.

Kranthi
Published on: 30 May 2021 9:28 AM IST
Cabinet Meeting Chaired by CM KCR Today
X

CM KCR:(File Image)

Telangana: తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరో పది రోజులు పెంచే అవకాశం వుందా అంటే అవును అనే సమాధానం వినడపుడుతుంది. తెలంగాణ‌ ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ రేపటితో ముగియనంది. మరోవైపు కరోనా కేసులు, లాక్ డౌన్‌ పై మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న మంత్రివర్గం సమావేశం కానుంది. అయితే తెలంగాణలో మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగించే అవకాశం కనిపిస్తుంది.

ప్రస్తుతం తెలంగాణలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నప్పటికీ మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడగిస్తేనే మంచిదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పొడగింపు పై సూచనలు చేయడంతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకోనుంది.

Kranthi

Kranthi

Next Story